మన్యం న్యూస్, పినపాక:
గత నాలుగు రోజులు నుండి కురుస్తున్న వర్షాలకు , ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరదకు గోదావరి పొంగి పొర్లుతుంది.ప్రభుత్వ విప్,భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అదేశాలు మేరకు పినపాక ఎంపిపి గుమ్మడి గాంధీ, బిఅర్ఎస్ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి జానంపేట పంచాయతీలోని భూపతిరావు పేట గ్రామాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తున్నందన ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి ఎక్కువైతే పునరావాస కేంద్రాలకు తరిలి వెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎంపిటీసి పోలిశెట్టి హరీష్,సొసైటి చైర్మన్ రవి శేఖర్ వర్మ,ఆత్మ కమిటీ చైర్మన్ పోనుగోటి భధ్రయ్య,మాజీ వైస్ ఎంపిపి దాట్ల వాసుబాబు, సోసైటి డైరెక్టర్ కామేశ్వరరావు ,బిఅర్ఎస్ నాయకులు బుల్లిబాబు,సీనియర్ నాయకులు ధర్మయ్య , లక్ష్మయ్య, వీర్రాజు , ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.