UPDATES  

 సీఎం కేసీఆర్ పాలన తెలంగాణకు శ్రీరామరక్ష

  • సీఎం కేసీఆర్ పాలన తెలంగాణకు శ్రీరామరక్ష
  • అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశం లోనే నెంబర్ వన్
  • అభివృద్ధి సంక్షేమం ఒక వైపు, పార్టీలో చేరికలు మరో వైపు
  • జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తున్న ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
  • చర్ల మండలం లోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 20 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక
  • గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన విప్,రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు: జూలై 22

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తనదైన ముద్ర వేస్తున్నారు.జిల్లా రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ,ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తూ,పార్టీ చేరికలలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు.ఒకవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, మరొకవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన సుమారు 20 కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు.రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా కాంతారావు గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ,సీఎం కేసీఆర్ నాయకత్వం లోని బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే దేశ అభివృద్ధి సాధ్యమని వారు అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు పరిచయం చేసింది సీఎం కేసీఆర్ నాయకత్వం లోని బిఆర్ఎస్ పార్టీయే అన్నారు. రానున్న రోజుల్లో దేశ ప్రజల ఆకాంక్షతోనే బిఆర్ఎస్ ఉద్భవించింది అని,బిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలలో ప్రకంపనాలు సృష్టించింది అన్నారు.తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధినే దేశమంతా అమలు చేస్తున్నారు అన్నారు.సీఎం కేసీఆర్ సాధ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు అన్నారు. రాష్ట్రాన్ని సమగ్ర భివృద్ధి చేసి అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్న సీఎం కేసీఆర్ వెంటనే రాష్ట్ర ప్రజలు ఉన్నారని వారు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రైతులను విషయంలో పూటకు ఒక మాట మాట్లాడుతున్నారని,వాళ్ళని నమ్మితే మళ్ళీ కష్టాలు పడాల్సిందే అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు హరిగోశలు పడ్డారని,కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని అన్నారు.పిండి బస్తాలు, విత్తనల బస్తాల కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టేవారని, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని గుర్తు చేశారు.తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ దేశం లోనే ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు తీసుకోవచ్చారని ఉచితంగా 24 గంటల కరెంటు,సాగునీరు, రైతుబంధు,రైతు భీమా, సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తున్నారని వివరించారు.గ్రామాలలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని చెప్పారు. పేదల కోసం పింఛన్లు,కళ్యాణ లక్ష్మి,కులవృత్తులకు ఆర్థిక సహాయం వెనదన్నుగా నిలుస్తున్నాయని విషయాలను ప్రజలకు తీసుకువెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోదేబోయిన బుచ్చయ్య,చర్ల మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు,మండల ప్రచార కార్యదర్శి కోటేరు.శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ తుర్రం. రవికుమార్,పార్టీ నాయకులు సీతాపతి రాజు,జోగిరాజు,పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !