- జూలూరుపాడులో భారీ రోడ్డు ప్రమాదం
- దగ్ధమైన వాహనాలు
- ప్రాణాలతో బయటపడ్డ వాహనదారులు
- మన్యం న్యూస్: జూలూరుపాడు, జులై 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల కేంద్రానికి సమీపంలోని ఒంటి గుడిసె క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం టు కొత్తగూడెం ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ ట్యాంకర్ ను వ్యాను ఢీకొనగా, సంఘటనా స్థలంలో ఆపిన మరో లారీ ట్యాంకర్ ను ఎనక నుండి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో భారీ మంటలు చెలరేగి, రెండు లారీలు దగ్ధమయ్యాయి. దీంతో ప్రధాన రహదారి కిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వ్యాన్ డ్రైవర్ ను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొందరు వ్యక్తులు ప్రధాన రహదారి ప్రక్కన కారు ఆపి మద్యం సేవిస్తుండగా, అటుగా వస్తున్న యాష్ లారీ ట్యాంకర్ డ్రైవర్ ఆపి వారితో వాదులాడుతుండగా, ఎనుక వైపు నుండి ట్యాంకర్ ను పాల వ్యాను ఢీ కొట్టిందని, వ్యాన్ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ ను రక్షిస్తున్న క్రమంలో మరో లారీ ట్యాంకర్ డ్రైవర్ ఆపి చూస్తుండగా, ఆ ట్యాంకర్ ను ఎనక నుండి వస్తున్న మరో లారీ ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, కారు ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.
