మన్యం న్యూస్ చండ్రుగొండ, జులై 22: ప్రస్తుతం వానకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మెడికల్ ఆఫీషర్ కనకం తనూజ అన్నారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. గత కొన్ని రోజలుగా నిరంతరాయంగా వానలు కురుస్తున్నాయని, నీటి నిల్వలు ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలన్నారు. మురుగునీటి నిల్వలు అధికంగా ఉంటే అంటువ్యాధులు ప్రభలే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవకాశం ఉన్నంత వరకు దోమ తెరలు వాడాలన్నారు. ఇంటి ఆవరణలో బాలిల్స్ లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఈ సమావేశంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.