మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
మండలంలోని దుమ్ముగూడెం గ్రామంలో గల కరకట్ట గేట్ వాల్ దగ్గర ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా గెట్ వాల్ నుంచి వరద నీరు గ్రామంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తగా ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరిగేషన్ ఏఈ రాజ్ సుహాస్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇసుక బస్తాల ఏర్పాటు పనులను ఇరిగేషన్ శాఖ సిబ్బంది ఎండి మస్తాన్ వలి బేగ్ దగ్గరుండి సిబ్బందితో పనిని పూర్తి చేశారు. ఏది ఏమైనా వరద నివారణకు ముందస్తుగా చర్యలు చేపట్టిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
