మన్యం న్యూస్ దుమ్ముగూడెం జూలై 22::
మండలంలోని రామచంద్రుని పేట గ్రామంలో రెండు గిరిజన కుటుంబాల ఇల్లులకు చెందిన కల్లూరు లక్ష్మి,సవలం వీర్రాజు రెండు ఇల్లు గత గురువారం కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైనాయి, దీని పై స్పందించిన లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం క్లబ్ సభ్యుల సహకారంతో 50 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు, 9000 రూపాయలు నగదును అగ్ని బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ వై సూర్యనారాయణ, క్లబ్ అధ్యక్షులు బి. వెంకటరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గుండు శరత్,ఫాస్ట్ ప్రెసిడెంట్ పి. దేసప్ప బిల్లీపెల్లి రంగారెడ్డి, దొసపాటి రాము,పచ్చిపులుసు వెంకట సుబ్బారావు,స్థానిక సర్పంచి అశ్విని,స్థానిక పెద్దలు కారం పుల్లయ్య, ఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.