మన్యం న్యూస్ గుండాల, ఆళ్లపల్లి: అన్నదాతకు ఆది నుండి కష్టంతోనే సావాసం చేస్తూ సేద్యాన్ని ప్రారంభిస్తాడు. దున్నే సమయం నుండి ప్రమాదాలతో సాగుతూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోతాడు. ఆళ్లపల్లి మండలం సంది బంధం గ్రామానికి చెందిన ఒక రైతు తన చేన్లో దుక్కి చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పల్టీ కొట్టింది డ్రైవర్ తృటిలో ఆ ప్రమాదం నుండి బయటపడటంతో ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా అన్నదాత సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డాడు
