- వనమా.. అయామ్ విత్ యూ
- భుజంతట్టిన సీఎం కేసీఆర్
- కొత్తగూడెం నియోజకవర్గానికి వరాల జల్లు
- త్వరలో వేపలగడ్డ పంచాయతీ
- వనమా నగర్, ఎస్సార్టీనగర్ వాసులకు త్వరలో ఇండ్ల స్థలాలు
- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం సానుకూలం
(మన్యంన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్)
ముఖ్యమంత్రి కెసిఆర్ ను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శనివారం కలిశారు. ఈ సందర్భంగా వనమా వినతులపై తక్షణం స్పందించిన సీఎం కేసీఆర్ వనమా భుజం తట్టారు. అయామ్ విత్ యూ.. గో ఎ హెడ్ అంటూ ప్రోత్సహించారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి పనులకు కావలసిన నిధుల కోసం సీఎం కేసీఆర్ తో వనమా వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు.
-ఎస్సార్టీ నగర్ , వనమా నగర్, మాయాబజార్ లో నివసిస్తున్న స్థానికులకు ఇల్లు కట్టుకోవడానికి సింగరేణి స్థలం కేటాయించాలని సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యే వనమా కోరారు. వెంటనే సింగరేణి సిఎండిని స్థలం కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
-కొత్తగూడెం జర్నలిస్టు ఇళ్ల స్థలాల సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఎమ్మెల్యే వనమా విన్నవించారు.
-ఎమ్మెల్యే వనమా విన్నపంపై స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని సీఎంఓ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
-సుజాతనగర్ గ్రామపంచాయతీలోని వేపలగడ్డ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీ చేయాలని సీఎం కేసీఆర్ కి ఎమ్మెల్యే వనమా విజ్ఞప్తి చేయగా, త్వరలో జరగబోవు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని సిఎస్ శాంత కుమారి ని ఆదేశించారు.
– కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ, లక్ష్మీదేవి పల్లి, సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లోని అభివృద్ధి పనులకు స్పెషల్ గ్రాంట్ నిధులు కేటాయించాలని కోరారు.
– ఎమ్మెల్యే వనమా విజ్ఞప్తికి వెంటనే స్పందించి అక్కడే ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు.
-అయామ్ విత్ యూ గో ఎహెడ్ అని ఎమ్మెల్యే వనమాకు సీఎం కేసీఆర్ హామీనిచ్చారు.