మన్యంన్యూస్,ఇల్లందు:బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జేకేలోని స్థానిక బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఎంఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఎంఎస్ ఇల్లందు బ్రాంచి ఉపాధ్యక్షులు నాయని సైదులు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం బీఎంఎస్-ఎస్సీఎంకేఎస్ యూనియన్ నాయకులు బీఎంఎస్ 69వ వార్షికోత్సవ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా బ్రాంచి సెక్రటరీ లీలాకృష్ణ, సెంట్రల్ ఆర్గనైజషన్ మాధవరెడ్డి, కోశాధికారి శశికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజశేఖర్, సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ ఏరియా ఉపాధ్యక్షులు రాము, కార్యవర్గ సభ్యులు శివ, వెంకటేష్, కిరణ్, పరంజ్యోతి మరియు తదితరులు పాల్గొన్నారు.
