మన్యం న్యూస్ చండ్రుగొండ,జులై 23 :అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు చొరవతో తిప్పనపల్లి పంచాయతీ మహ్మద్ నగర్ గ్రామంలో కొత్తగా రేషన్ బియ్యం, సరుకుల సరఫరా కేంద్రం మంజూరైందని ఎంపిటీసీ లంకా విజయలక్ష్మి అన్నారు. ఆదివారం మహ్మద్ నగర్ గ్రామంలో నూతనంగా మంజూరైనా రేషన్ షాపును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….గత 20 ఏండ్లుగా మహ్మద్ నగర్ గ్రామస్తులంతా తిప్పనపల్లి వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి రేషన్ సరుకులు తీసుకెళ్లేవారని, సమస్యను ఎమ్మేల్యే దృష్టికి తీసుకెళ్లగా ఉన్నతాధికారులతో మాట్లాడి మహ్మద్ నగర్ గ్రామంలో రేషన్ షాపును నడపాలని ఆదేశాలను జారీ చేయించటం జరిగిందన్నారు. ప్రజల కోసం మంచి చేసే ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎల్లప్పుడు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, బిఆర్ఎస్ నాయకులు కళ్లేం వెంకటేశ్వర్లు, బాషా, ఉస్సేన్, తదితరులు పాల్గొన్నారు.