UPDATES  

 రామచంద్ర హైస్కూల్లో ఆత్మీయ సమ్మేళనం

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
1982-83 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు రామచంద్ర హైస్కూల్(బాలుర) ఉన్నంత పాఠశాల ఆవరణలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న స్నేహితులు ఒక దగ్గరికి చేరి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ప్రేమ ఆప్యాయతలకు స్నేహితులు ప్రతిక అని అటువంటి స్నేహితులందరూ ఒక్క దగ్గర కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. కంప్యూటర్ యుగంలో మారుతున్న పరిస్థితులను బట్టి నేటి విద్యార్థులతో పాటు కుటుంబాల మధ్య సఖ్యత లోపించిందని సెల్ ఫోన్ లే తప్ప ఆనాటి ప్రేమ అనురాగాలు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆత్మీయ సమ్మేళనాలు కుటుంబాల మధ్య సఖ్యతకు దోదపడతాయన్నారు. అంతేకాకుండా పిల్లల మధ్య కూడా అనురాగాలు పెరుగుతాయని వివరించారు. ఈ అపూర్వ ఆత్మీయ సమ్మేళనంతో మధుర స్మృతులను నెమరేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పూర్వ విద్యార్థులకు మెమొంటోలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !