మన్యం న్యూస్ వాజేడు.
తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఈ జలపాతం ఉంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. ఆదివారం సెలవు కావడంతో పర్యటకుల సందడి పెద్ద ఎత్తున పెరిగింది. విద్యార్థులు, ఉద్యోగులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు.బొగత జలపాతానికి పర్యటకుల వాహనాలు పార్కింగ్ లో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని సందర్శకులు కోరుతున్నారు.