మన్యం న్యూస్ బూర్గంపహడ్:- గోదావరి వరదల నేపథ్యంలో ఇప్పటికే మత్స్యకారులను సైతం చేపల వేటకు వెళ్ళవద్దని జిల్లా అధికార యంత్రాంగం సూచన చేస్తుంది.ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో పాల్వంచ డిఎస్పి వరదలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి నీటి నుంచి ఎటువంటి ప్రమాదాలు స్థంభవించకుండా ముందస్తుగా 8 మంది గజఈతగాళ్ళను,బృంధంగా ఏర్పాటు చేసి.వరద ప్రభావిత ప్రాంతాలలో ఉంచనున్నట్టు తెలిపారు.గత ఏడాది గోదావరిలో నాటు పడవ పల్టీ కొట్టి ప్రమాదం స్తంభవించిన నేపథ్యంలో ఎనిమిది మందిని కాపాడిన బూర్గంపహడ్ మత్స్యకారుల బృందాన్ని గుర్తుచేసి వారి సేవలను కొనియాడి,అభినందించారు.ఈ సర్కిల్ సీఐ వినయ్ కుమార్,స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ అదనపు ఎస్ఐ శ్రీను నాయక్ కానిస్టేబుళ్లు రామకృష్ణ,లక్ష్మణ్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.