UPDATES  

 గ్రామ పంచాయతీ కార్మికుల సహనాన్ని పరీక్షించొద్దు

– హామీల అమలు, చట్టబద్ద హక్కులకోసమే కార్మికులు పోరాడుతున్నారు
– సమ్మె నివారణ చర్యలు చేపట్టండి
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

మన్యం న్యూస్(భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి):
న్యాయమైన డిమాండ్ల పరిస్కారంకోసం రాష్ట్ర వ్యాపితంగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారని కార్మికుల సమ్మె ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తూ వారి సహనాన్ని పరీక్షించొద్దని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కొత్తగూడెం పట్టణంలో పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరసన శిబిరాన్ని ఆదివారం సందర్శించి కార్మికులనుద్దేశించి మాట్లాడారు. 18 రోజులుగా సమ్మె జరుగుతుంటే ప్రభుత్వ పెద్దలకు పట్టదా అని ప్రశ్నించారు. కనీస వేతనాలు, పనిభద్రత, జీవోలు, చట్టబద్ద హక్కుల అమలునే కార్మికులు కోరుతుంతున్నారేగాని వారివి గొంతెమ్మ కోర్కెలు కాదని అవి రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలోనివేనని అన్నారు. కార్మికుల శ్రమకు ఏ ప్రభుత్వమైనా ప్రతిఫలం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఉద్యమాలను నిర్లక్ష్యం చేసి కార్మికులకు దూరం కావద్దని, కేవలం గ్రామపంచాయతీ కార్మికుల ఉద్యమమనుకుంటే పొరపాటేనని, భవిష్యత్తులో ఈ ఉద్యమం ఇతర రంగాలకు విస్తరిస్తుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. శిబిరాన్ని సాదర్శించిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, జిపియు జేఏసీ నాయకులు వున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !