మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఆదేశం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఐటి పురపాలక శాఖా మంత్రి కల్వకుంట తారకరామారావు జన్మదిన సందర్భంగా కొత్తగూడెం పురపాలక కార్యాలయంలో
వార్డు సభ్యులు మున్సిపల్ పారిశుద్య కార్మికుల సమక్షంలో సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కేక్ కట్ చేసి కార్యాలయములో మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా
మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ కల్వకుంట తారకరామారావు మంత్రిగా భాద్యతలు స్వీకరించి మున్సిపల్ శాఖాకు వన్నె తెచ్చే విధంగా పలు సంస్కరణలు చేపట్టడం జరిగిందన్నారు. మున్సిపల్ శాఖలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల సంక్షేమం కొరకు ప్రాధాన్యం ఇచ్చి మూడు సార్లు వేతనం పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమములో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, గౌరవ వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ మేనేజరు, కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది రిసోర్స్ పర్సన్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
