- మైనార్టీలను గుర్తించిన ఎకైక సీఎం కేసీఆర్.
- కరకగూడెం కో-ఆప్షన్ సభ్యులు షేక్ సోందుపాషా
- మైనార్టీలకు రూ 1 లక్ష సాయం పట్ల సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
- మైనార్టీల అభివృద్ధి,సంక్షేమంమే బీఆర్ఎస్ లక్ష్యం ఎంపీపీ రేగా కాళికా
మన్యం న్యూస్ కరకగూడెం: మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ తమని గుర్తించింది సీఎం కేసీఆర్ అని కరకగూడెం కో-ఆప్షన్ సభ్యులు డాక్టర్ షేక్ సోందుపాషా అన్నారు.ఈ మేరకు ఆయన సోమవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మైనార్టీలకు రూ 1 లక్ష సాయం బ్యాంక్ లింకేజీ లేకుండా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి మండల ఎంపీపీ రేగా కాళికాతో కలసి పాలాభిషేకం చేసారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మైనార్టీల ఆర్ధిక స్వావలంబనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది పేదలకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.అంతేకాకుండా ముస్లింలకు మైనార్టీ ఆర్థిక సహకార సంస్థ నుంచి, ఇతర మైనార్టీలకు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని బీసీలకు అందజేసిన మాదిరిగానే పనిముట్ల కొనుగోలు, ఆధునికీకరణ, ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సాయం అందజేస్తారని పేర్కొన్నారు.ఈ పథకానికి 21 నుంచి 55 ఏండ్ల లోపు వారు అర్హులని వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు.కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుందని తెలిపారు. అలాగే
కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని,విద్య, ఉపాధి తదితర రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదని తెలిపారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తున్నదని ఆనందం వ్యక్తంచేశారు. విభిన్న సంస్కృతులు, విభిన్న మత ఆచార, సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమున తహజీబ్‌ను కాపాడే ప్రక్రియ బీఆర్ఎస్ పాలనలో కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ లక్ష్యం అని పేర్కొన్నారు.అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక,ఐటీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ నాయకులు,పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
