మన్యం న్యూస్ దుమ్మగూడెం జులై 24::
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను సోమవారం నాడు మండల కేంద్రంలోని లక్ష్మీనగరం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా, ఎంపీటీసీ భీమరాజు, సహాయ కార్యదర్శి కెల్లా శేఖర్, లక్ష్మణ్, యువజన విభాగం అధ్యక్షులు అల్లాడి వెంకటేష్, కార్యదర్శి గంగరాజు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
