- ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
- దేశంలోనే ఉత్తమ ఐటీమంత్రి కేటీఆర్: ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్
- తెలంగాణ భావితరాలకు ఆశాకిరణం యువకిరణం కేటీఆర్: మున్సిపల్ ఛైర్మెన్ డీవీ
మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ పురపాలకశాఖ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నడుమ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయ ఆవరణలో పార్టీ శ్రేణులతో కలిసి మొక్కను నాటారు. అనంతరం ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను ఆప్యాయంగా పలకరించి వారికి మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కేక్ కట్ చేసి మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ..మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకుపోతున్నారని అటువంటి వారు నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజాక్షేత్రంలో ఎన్నో పదోన్నతులు పొందుతూ సమాజానికి సేవలు చేయాలని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ అన్నారు. సంక్షేమంతో వెలకట్టలేని ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న యువనాయకులు తారకరామారావు అని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ అభిప్రాయపడ్డారు. విదేశాలకు ధీటుగా ఎన్నో ఐటిపరిశ్రమలను తెలంగాణరాష్ట్రంలో నెలకొల్పడానికి విశేషంగా కృషి చేస్తున్నారని, విదేశాలలో సైతం ఎన్నో దిగ్గజ ఐటీపరిశ్రమల సమావేశాలలో హాజరవుతూ ఎప్పటికప్పుడు ఐటీ పరిశ్రమలస్థాపనే లక్ష్యంగా దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటిరంగంలో ప్రపంచంలో విదేశాలతో పోటీపడేవిధంగా చేసిన ఘనుడు మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ అభిప్రాయపడ్డారు. అనంతరం మున్సిపల్ ఛైర్మెన్ డీవీ మాట్లాడుతూ.. భావిభారతతరాల ఆశాజ్యోతి, యువకిరణం కేటీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల జడ్పిటిసి ఉమాదేవి, మండల ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, పట్టణ ప్రధాన కార్యదర్శి పర్చూరు వెంకటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు వారారవి, కటకం పద్మావతి, సయ్యద్ అజాం, తోటలలిత శారద, జెకెశీను, కడగంచి పద్మ, చీమలసుజాత, గిన్నారపు రజిత, అంకెపాక నవీన్, వంకుడోత్ తార, ఎంపీటీసీ పూనం లింగమ్మ, సర్పంచ్ వల్లాల మంగమ్మ, పార్ట్ అధ్యక్షుడు శీలం రమేష్, ప్రధానకార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, గార్లమండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, గార్ల ఎంపిపి మూడుశివాజీ, పట్టణ ఉపాధ్యక్షుడు పీవీ కృష్ణారావు, అబ్దుల్ నబీ, ఎస్కేపాషా, ఎస్కే యాకూబ్, పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇంచార్జ్ గిన్నారపు రాజేష్, ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇంచార్జ్ సత్తాల హరికృష్ణ, ఇంద్రనగర్ వార్డ్ నెంబర్ నీలంరాజశేఖర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, మహిళాకమిటీ గండ్రతి చంద్రావతి, బొప్పి భాగ్యలక్ష్మి, మదర్ బి, భవాని, టిఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మేకల శ్యామ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణనాయకులు గిన్నారపు రవి, ఎర్రఈశ్వర్, రాచపల్లి శీను, యువజన నాయకులు మెరుగుకార్తీక్, నెమలి నిఖిల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.