మన్యం న్యూస్ గుండాల, ఆళ్లపల్లి: పినపాక సంక్షేమ సారధి ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వెంట నడుస్తామంటూ ఆళ్లపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ రేగా సమక్షంలో పది కుటుంబాలు చేరడంతో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఆళ్లపల్లి మండలంలో చూడనంత అభివృద్ధి సంక్షేమాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడికి అండగా నిలవాలని పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలుస్తూ ఆపద సమయంలో వారికి బాసటగా నిలుస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబా, ఎస్సీ సెల్ అధ్యక్షులు బాబు, నాయకులు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు
