మణుగూరు
పినపాక నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కృష్ణ మోహన్, కార్యదర్శి శ్రీహరి, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఎమ్మెల్యే రేగా కాంతారావుని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ మీడియా మిత్రులు అందరూ ఐక్యత గా ఉంటూ నియోజకవర్గం లోని సమస్యలను, ప్రభుత్వం దృష్టి కి తీసుకురావాలని తద్వారా నియోజక ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నం చేయాలని అన్నారు.