UPDATES  

 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

 

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్
డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో స్వాతంత్య్ర
దినోత్సవ వేడుకలు నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు విధానంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సన్నద్దపై
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు ప్రగతి నివేదికలు
అందచేయాలని ఆదేశించారు. అసెట్లు పంపిణికి లబ్దిదారుల జాబితా సిద్ధం చేయాలని చెప్పారు. ప్రోటోకాల్
ఏర్పాట్లు డిఆర్డీ పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రభుత్వ, సంక్షేమ వసతి గృహా విద్యార్థినీ, విద్యార్థులతో
దేశభక్తి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిఈఓ, డిపిఓఆర్న
ఆదేశించారు. ప్రగతి మైదానాన్ని సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. షామియానాలు,
కుర్చీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఐడిఓసి కార్యాలయంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పని
సరిగా బయోమెట్రిక్ వేయాలని చెప్పారు. బయోమెట్రిక్ హాజరుపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహిస్తామని
చెప్పారు. తక్కువ హాజరు నమోదైన అధికారులు కారణాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మధుసూదన్ రాజు, అన్ని శాఖల జిల్లా అధికారులు
తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !