– వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు మంచి గుణపాఠం
– నాలుగున్నర సంవత్సరాలుగా తీసుకున్న జీతం టి.ఏ డి.ఏ లు తక్షణం ప్రభుత్వానికి ఇచ్చేయాలి
– ఐ ఎన్ టి యు సి స్టేట్ పైస్ ప్రసిడెంట్ డాక్టర్ శంకర్ నాయక్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
గత ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు పెద్ద మోసగాడని వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేయడం మంచి గుణపాఠం అని నాలుగున్నర సంవత్సరాలుగా తీసుకున్న జీతం టి.ఏ డి.ఏలు తక్షణం ప్రభుత్వానికి ఇచ్చేయాలని
ఐ ఎన్ టి యు సి స్టేట్ పైస్ ప్రసిడెంట్ డాక్టర్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం ప్రజల దగ్గర దళిత బందు పేరుతో ఆక్రమముగా వసూల్ చేసిన డబ్బులు ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని అన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గం బస్టాండ్ సెంటర్ రైటర్ బస్తి నందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్టేట్ పైస్ ప్రసిడెంట్ డాక్టర్ శంకర్ నాయక్, బొమ్మిడి మల్లికార్జున్ లు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు పడటం వనమాకు తగు గుణపాఠం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మనోభావాలను వనమా దెబ్బతీయడం జరిగిందన్నారు. వనమా కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు కాబట్టే దేవుడు కనికరించి ఆయనపై అనర్హత వేటు పడేలా చేసిందన్నారు.
ఈ కార్యక్రమములో లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు, చుంచుపల్లి బీసీ సెల్ నాయకులు సిరంగి శ్రీనివాస్ రావు, లక్ష్మిదేవిపల్లి మండల యస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్, చుంచుపల్లి మండల యస్సీ సెల్ అధ్యక్షులు శనగ లక్ష్మణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలిపాక సత్యనారాయణ, పట్టణ మైనార్టీ నాయకులు అక్బర్, రముర్తి, మాగం నరేష్, పాంచాల నాగభూషణం, పుల్లురీ కుమార్, గడ్డిగుట్ట నరేష్, శ్రీనివాస్, రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.