మణిపూర్ లో బిజెపి ప్రభుత్వాన్ని తక్షణం బర్తరపు చేయాలి
– సిపిఐ, సిపిఎం జిల్లా కార్య దర్శులు సాబీర్ పాషా, కనకయ్యలు డిమాండ్ – జోరు వానలో మణిపూర్ బాధితులకు అండగా నిరసన కార్యక్రమం
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
మణిపూర్ రాష్ట్రంలో గత రెండు నెలల కాలంగా సాగుతున్న మారణకాండ, స్త్రీలపై అఘాయిత్యాలు, గృహ దహనాలు ఆపాలని ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలని బాధితులకు అండగా నిలవాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం పార్టీల రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా మంగళవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఉభయ పార్టీల ఆధ్వర్యంలో జోరు వర్షంలో సైతం తడుస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ సిపిఎం జిల్లా కార్య దర్సులు ఎస్కే సాబీర్ పాషా, అన్నవరపు కనకయ్యలు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా మణిపూర్లో మహిళలపై అమాయక ప్రజలపై దాడులు చేస్తూ గృహ దానాలు పాల్పడుతూ మహిళలను చిత్ర హింసలు వస్త్రలను చేసి చేసి గ్యాంగ్ రేప్లు చేసి చంపి వేయడం దారుణమన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 150 మందిని పొట్టన పెట్టుకున్నారని వారు ఆవేదన వెలుబుచ్చారు. మణిపూర్ లో మెజార్టీ గా ఉన్న మైతీ తెగకు కుకి నాగా తెగలకు మధ్య అక్కడ బిజెపి ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో చిచ్చురేపిందని విమర్శించారు. మెజార్టీ గా ఉన్న మైతి తెగ వారికి బిజెపి సపోర్ట్ చేస్తూ ఓట్లు సీట్లు అధికారం కోసం ఇంతటి దారుణ అకృత్యాలకు దిగటం సిగ్గుమాలిన చర్యని తీవ్రంగా దుయబట్టారు. తక్షణం దేశ ప్రధాని నోరు విప్పాలని పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిపి బాధితులకు అండగా నిలవాలని మణిపూర్లో శాంతిని నెలకొల్పాలని అకృత్యాలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేష్టలు అడిగిన ఆ రాష్ట్ర బిజెపి ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ ను డిస్మిస్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జములయ్య, మహిళా సమైక్య జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కె. రత్నకుమారి, సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, ఐద్వా నాయకురాలు సందకూరి లక్ష్మి, సమ్మయ్య, బిక్కులాలు, సిపిఐ, సిపిఎం నాయకులు భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, షాహిన్, షమీమా అబ్బులు, కిలారు ప్రసాదు, నవీన్, భద్రం, రమేష్, పాషా తదితరులు పాల్గొన్నారు.