UPDATES  

 పెండింగ్ ఉన్న దరఖాస్తులు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

 

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పెండింగ్ ఉన్న దరఖాస్తులు బుధవారం వరకు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుండి ఫారం 6,7,8 నమోదు ప్రక్రియపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ ఐడిఓసి కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతన ఓటర్లు ఫారం 6 ద్వారా 16099 దరఖాస్తులు రాగా 14749 విచారణ పూర్తి చేయగా 350 పెండింగ్ ఉన్నాయని ఉన్నాయని చెప్పారు. అదే విధంగా మరణించిన ఓటరు తొలగింపుకు 4292 ఫారం 7 జారీ చేయగా మంగళవారం వరకు 3826 విచారణ ప్రక్రియ పూర్తి కాగా 448 పెండింగ్ ఉన్నాయన్నారు. అలాగే ఓటరు చిరునామా మార్పులు, చేర్పులకు ఫారం 8కు ద్వారా 21812 దరఖాస్తులు రాగా 21357 దరఖాస్తులు విచారణ ప్రక్రియ పూర్తి కాగా 455 పెండింగ్ ఉన్నాయని చెప్పారు. అన్ని కలిపి ఫారం 6, 7, 8లకు 41205 దరఖాస్తులకు గాను 39952 విచారణ ప్రక్రియ పూర్తి చేశామని, మిగిలిన 1253 దరఖాస్తులు బుధవారం వరకు ఎన్నికల కమిషన్ పోర్టల్ లో అప్లోడ్ చేస్తామని చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు స్వర్ణలత, రత్నకళ్యాణి, ఎస్డీసి శివాజి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !