పినపాక గ్రామం – రహదారులమయం
గ్రామంలో 90 శాతం రహదారులు పూర్తి
ఎమ్మెల్యేకు, మండల ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు చెబుతున్న ప్రజానీకం
మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని పినపాక గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో, ప్రజా ప్రతినిధుల జోక్యంతో అన్ని వీధులకు రహదారులు ఏర్పడ్డాయి. గ్రామపంచాయతీ నిధులతో కొన్ని రహదారులు పూర్తికాగా, ఎంపీపీ నిధులనుండి మరికొన్ని రహదారులు, ఇతర బిఆర్ఎస్ నాయకుల చొరవతో మరికొన్ని రహదారులు పూర్తి అయ్యాయి. గతంలో చినుకు పడితే బురద మయంగా ఉన్న రహదారులు, నేడు బీటీ రోడ్డుతో దర్శనమిస్తున్నాయి. గ్రామ గ్రామానికి రహదారుల ధ్యేయంతో పెద్దాయనను ఒప్పించి మరి నియోజకవర్గానికి నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఆయన చేస్తున్న కృషి, నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ గుర్తు పెటకుంటారు. గత పాలకులు అభివృద్ధిని మరచి స్వలాభమే ధ్యేయంగా బ్రతికారని , దానికి విరుద్ధంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నాడని పినపాక గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాలకు సరిపోయేంత పనిని కాంతారావు పూర్తి చేశారని, ఇతర ఏ నాయకులకు సాధ్యం కాదని అనుకుంటున్నారు.
గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా రహదారుల నిర్మాణం చేసి మార్గదర్శి అయినా ఎమ్మెల్యే గురించి పలువురి మనోభావాలు ఎలా ఉన్నాయి.
1) అసాధ్యుడు రేగా కాంతారావు (గుమ్మడి గాంధీ పినపాక మండలం ఎంపీపీ):
ఎవరికీ సాధ్యం కానీ అభివృద్ధిని మన నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పూర్తి చేయగలిగాడు. వర్షాకాలంలో గ్రామ గ్రామాన రహదారుల సమస్యలు ఉండేవి. ఆయన కృషితో రహదారుల నిర్మాణం దాదాపుగా పూర్తి అయింది.
2) అభివృద్ధికి చిరునామా రేగా(కోలేటి భవాని శంకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి):
నా అనుభవంలో చాలామంది పాలకులను దగ్గరుండి గమనించాను. పని పట్ల నియమ నిబద్ధత కలిగిన వ్యక్తిగా రేగా కాంతారావును గమనించాను. ఎన్నాళ్ళ నుండో అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఎంతగానో శ్రమించాడు. ఎన్నో కష్టాలు పడి, నియోజకవర్గానికి నిధులు తెచ్చి అభివృద్ధికి అందలం వేశాడు.
3) సమస్యల పరిష్కారానికి ముందుంటాడు (ఎంపీటీసీ చింతపంటి సత్యం):
సమస్య ఏదైనా తెలియజేసిన వెంటనే స్పందించే గుణం ఎమ్మెల్యే రేగా కాంతారావుది. వెంటనే ఆ సమస్య పరిష్కార దిశగా ఆలోచించి జనాల గుండెల్లో చిరస్థానం ఏర్పరచుకున్నాడు.
4) మా గ్రామం రేగా సేవలను మర్చిపోదు( గొగ్గల నాగేశ్వరరావు సర్పంచ్, పినపాక):
మా గ్రామానికి ప్రతి వీధికి రహదారి నిర్మాణం జరిగిందంటే కారణం ఎమ్మెల్యే రేగా కాంతారావు అని చెప్పాలి. గ్రామంలోని వీధులకు రహదారి సౌకర్యం లేదని చెప్పిన వెంటనే స్పందించి, నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయం. మా గ్రామ ప్రజలు ఎప్పటికీ రేగా సేవలను మరిచిపోరు.
5) నియోజకవర్గ మార్గదర్శి (కొత్త దామోదర్ గౌడ్, రేగా వీరాభిమాని):
మా గ్రామంలోనే కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు, వంతెనల నిర్మాణం అద్భుతం. ఆయన చేసిన అభివృద్ధి పనులు కోకొల్లలు. ఆయన చేసిన అభివృద్ధికి జనం నీరాజనాలు పడుతున్నారు. ఆయన అభిమానిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను