చేపల వేటకు వెళ్లి వృద్ధుడు గల్లంతు
వెంకటాపురం మండలం బోదాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
బొగ్గుల బండి అనే వృద్ధుడు చాపల వేటకని వెళ్లి ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో కాలు జారిపడి గల్లంతయ్యాడు. వెంటనే చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో తెలియజేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తిరుపతిరావు, సిఐ శివ ప్రసాద్, తాసిల్దార్ నాగరాజ్, హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని విచారింపగా స్థానిక ప్రజలు ఈ విధంగా తెలియజేశారు. బొగ్గుల బండి రోజు చాపల వేటకు వెళ్లేవాడని, అలాగనే ఈరోజు కూడా చేపల వేటకు వెళ్లి, కాలు జారీ వాగులో గల్లంతయాడని స్థానికులు తెలియజేశారు. వెంటనే స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లను సిఐ శివప్రసాద్ రంగంలోకి దింపి గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. స్థానికులు బండి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
