మన్యం న్యూస్: జూలూరుపాడు, జులై 25, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో వామపక్షల నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు, అఘాయిత్యాలు, అరాచకాలకు నైతిక బాధ్యత వహిస్తూ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కుల, మత, జాతుల మధ్య వైరుధ్యాన్ని పెంచి పోషిస్తుందన్నారు. తక్షణమే మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చండ్ర నరేంద్ర కుమార్, సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సీపీఎం మండల కమిటీ సభ్యుడు వల్లమల్ల చందరరావు, గార్లపాటి వెంకటి, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ మండల కార్యదర్శి బానోత్ ధర్మ, ఏదులాపురం గోపాలరావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే నాగుల మీరా, వామపక్ష నాయకులు భానోత్ మధు, ఎస్.కె చాంద్ పాషా, రాయల సుధాకర్, బొడ అభిమిత్ర, బోలి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.