మన్యం న్యూస్ దుమ్మగూడెం జులై 25::
రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తూ సోమవారం జీవో 81 విడుదల చేయడంతో మండల వీఆర్ఏలు మంగళవారం నాడు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ కి పాలాభిషేకం చేసి వారి ఆనందం వ్యక్తం చేశారు. పే స్కేల్ జీవో ఇవ్వడంతో మొత్తం మండలం లోని 13 మంది వీఆర్ఏలకు లబ్ధి చేకూరుతుంది. ఈ సందర్భంగా వీఆర్ఏ మండల అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు వీఆర్ఏ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మాకు ఎప్పుడు చరిత్రలో చిరస్థాయిలో కేసీఆర్ నిలిచిపోతారని అన్నారు. మా వీఆర్ఏలు అందరూ రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏలు రాజేష్, నవీన్, వెంకటలక్ష్మి, శాలిని, లక్ష్మి, ముత్యం, చంటి, మహేష్, సీతారాములు, వీర్రాజు, నాగేశ్వరరావు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.