బీఆర్ఎస్ పార్టీలో ఊపందుకున్న చేరికలు
రేగా సమక్షంలో ఆళ్లపల్లి మండలానికి చెందిన పలువురు చేరిక
మన్యం న్యూస్ గుండాల: బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆళ్లపల్లి మండలానికి చెందిన ముదిరాజ్ సంఘానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుర్చుకున్నారు. సంక్షేమంలో అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంగా నిలుపుతున్న రేగా కాంతారావుతో కలిసి ముందుకు సాగేందుకే పార్టీలో చేరినట్టు పలువురు పేర్కొన్నారు. రానున్న రోజులలో రేగన్నను అఖండ మెజార్టీతో గెలిపించుకునే విధంగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు
