మన్యం న్యూస్ గుండాల: ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. జీవో నెంబర్ 3ను అమలు చేయడం ద్వారా ఏజెన్సీలో ఉన్న గిరిజనులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా గిరిజనులకు న్యాయం జరుగుతుందని అన్నారు. జీవో నెంబర్ 3ని సుప్రీం కోర్టులో గిరిజన ఇతరులు కొట్టివేసి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు
