మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- మైనార్టీలను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి కెసీఆర్ గారే అని,మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ తమని గుర్తించింది సీఎం కేసీఆర్ అని బూర్గంపహాడ్ మండల మైనార్టీ అధ్యక్షులు సాదిక్ పాషా అన్నారు.ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మైనార్టీల సభలో బూర్గంపహాడ్ బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు సోహెల్ పాషా మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలను కూడా ప్రత్యేకంగా గుర్తించి షాదిముబారక్ లను,రంజాన్ పండుగను పురస్కరించుకొని రంజాన్ కానుకలను అందించడమే కాక మైనార్టీలకు లక్ష రూపాయల “బందు” కార్యక్రమంతో ఇచ్చే రుణాన్ని బ్యాంక్ లింకేజీ అనే సమస్య లేకుండా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటాము అని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఏ సత్తార్,ఎండి షహబాజ్,ఎస్.కె ఖయ్యూం,ఎండి శోకత్ అలీ,ఎండి అమీర్ పాష,ఎస్కే ఆసిఫ్ పాల్గొన్నారు.