UPDATES  

 ముందు రక్షణ తర్వాతే ఉత్పత్తిపై దృష్టి సారించాలి – 18వ ఏరియా లెవెల్ భద్రత సమావేశం

 

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
రుద్రంపూర్ ఆర్ సి ఓ ఏ క్లబ్ లో మంగళవారం
18 వ ఏరియా లెవెల్ త్రేపాక్షిక భద్రత సమావేశం సెంట్రల్ జోన్ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డివైడిజిఎంఎస్)భూషణ్ ప్రసాద్ సింగ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా గని ప్రమాదాలలో మరణించిన ఉద్యోగుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. తరువాత రక్షణ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అనంతరం గత రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ప్రతిపాదించిన తీర్మానాలు అమలైన అంశాలపై సమీక్షించారు. రక్షణ చర్యలు ప్రమాదాలు నివారణకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. డివైడిజిఎంఎస్ రక్షణను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రక్షణపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన తర్వాతే ఉత్పత్తిపై దృష్టి సారించాలన్నారు. అనంతరం కొత్తగూడెం ఏరియాలోని అన్ని యూనియన్ ప్రతినిధులు అధికారులు కొత్తగూడెం ఏరియాలో రక్షణపై తీసుకుంటున్న చర్యల గూర్చి మరి ఇకపై తీసుకోవాల్సిన చర్యలను గూర్చి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమేష్. యం సవర్కర్ డైరెక్టర్( మైనింగ్ ), ఎస్. ఆనంద్ వాల్(ఎలక్ట్రికల్), ఎస్. జి. బైసారే, డైరెక్టర్(మెకానికల్), డాక్టర్ జార్జ్ జాన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ మైండ్స్(ఓహెచ్), కమలేష్ కుమార్ వర్మ డిప్యూటీ డైరెక్టర్(మైనింగ్), సనత్ కుమార్ పి డిప్యూటీ డైరెక్టర్(మైనింగ్), దిలీప్ కుమార్ డిప్యూటీ డైరెక్టర్(మెకానికల్), రాజీవ్ హోమ్ ప్రకాష్ వర్మ డిప్యూటీ డైరెక్టర్ (ఎలక్ట్రికల్), గౌరవ్ లద్ద డిప్యూటీ డైరెక్టర్ (ఎలక్ట్రికల్), సింగరేణి డైరెక్టర్(పి అండ్ పి) జి. వెంకటేశ్వర్ రెడ్డి, జిఎం సేఫ్టీ కే.గురవయ్య, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్, ఏం సాలెం రాజు, జిఎం సేఫ్టీ కొత్తగూడెం రీజియన్ జె. కుమారస్వామి యూనియన్ ప్రతినిధులు ఎండి.రజాక్, కే.రాములు, కే.ఆల్బర్ట్,
వి.శ్రీనివాస్, వై.ఆంజనేయులు, శ్రీరంగ పవన్ కుమార్, అన్ని గనుల వర్క్ మై ఇన్స్పెక్టర్ ఏజెంట్లు, మేనేజర్లు, గ్రూప్ ఇంజనీర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ఫిట్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !