మన్యం న్యూస్ గుండాల: మావోయిస్టు పార్టీ వారోత్సవాల నేపథ్యంలో భాగంగా గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ సిబ్బందితో కలిసి మండలంలో ముమ్మర తనిఖీలను చేపట్టారు. మండల కేంద్రం నుండి పట్టణాలకు వెళ్లే రహదారులలో క్షుణ్ణంగా పరిశీలించాకే వాహనాలను అనుమతిస్తున్నారు. వారోత్సవాల నేపథ్యంలో ఎటువంటి విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మండలంలోని గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
