మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చిన పర్యావరణ పరిరక్షణ వారం పిలుపులో భాగంగా మంగళవారం రెండవ రోజు చుంచుపల్లి పభుత్వ ఉన్నత పాఠశాలలో చుంచుపల్లి మండల రెవెన్యూ అధికారి కృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు మరువలేనివి అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న లయన్స్ కృషిని అభినందించారు. షేక్ దస్తగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంఛార్జి హెచ్ఎం తబితా సంధ్యరాణి, రీజినల్ ఛైర్మెన్ గబ్బెట రాజన్న, లయన్స్ మోరిసెట్టీ మోహనరావు, కూర శ్రీధర్, పల్లపోతు శ్రీనివాస్, షేక్ దస్తగిరి, లగడపాటి రమేష్, చెరుకు శ్రీనివాస్, సక్రు, మన్నెం జవహర్ రెడ్డి, కొయ్యడ నగేష్, మొక్కల రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.