UPDATES  

 విద్యారంగ సమస్యల పరిష్కారణకై…. సంఘర్షణ సైకిల్ యాత్ర.. ఎస్ఎఫ్ఐ

 

మన్యం న్యూస్ దుమ్మగూడెం జులై 26::
విద్యారంగంలో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ఈ సంఘర్షణ యాత్ర చేపడుతున్నట్టు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం అన్నారు. బుధవారం మండలంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘర్షణ యాత్ర దుమ్ముగూడెం మండలం రెండొవ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా మండలంలోని కస్తూర్బా గాంధీ, ఆశ్రమ పాఠశాల, సంక్షేమ హాస్టల్లో సందర్శించి విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యను పరిష్కరించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్, విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ధరలకు అనుకూలంగా మెనూ చార్జీలు పెంచాలని, అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించి, భద్రాచలం కేంద్రంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పవన్, డివిజన్ ఇంచార్జ్ భూపేందర్, ఉపాధ్యక్షులు అభిమన్యు, మండల కమిటీ సభ్యులు నాగకృష్ణ, రామ్ చరణ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !