- బాధిత కుటుంబానికి ఎన్ ఆర్ ఐ ప్రసాద్ కూనరపు వితరణ
- గాంధార్ల సమ్మయ్య కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత
- ఎన్నారై ప్రసాద్ సేవలు అభినందనీయం:కటకం గణేష్
మన్యం న్యూస్ పినపాక:
పినపాక మండల పరిధిలోని తో గూడెం గ్రామానికి చెందిన గాంధర్ల సమ్మయ్య ఇల్లు ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు నేలమట్టమయింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం టీ. టీ. ఏ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, గోపాలరావుపేటకు చెందిన ఎన్నారై ప్రసాద్ కూనారపు బాధిత కుటుంబానికి అండగా ఉండడానికి ముందుకు వచ్చారు.ఈ నేపథ్యంలో మంగళవారం తో గూడెం గ్రామంలో ప్రసాద్ తండ్రి కూనరపు బక్కయ్య, సోదరుడు కూనారపు రాము రూ.4 వేల విలువైన 50 కేజీల బియ్యం,ఇతర నిత్యవసర సరుకులు బాధిత వ్యక్తి సమ్మయ్య కు అందజేశారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కటకం గణేష్ మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన ఎన్నారై ప్రసాద్ కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబాల దీనగాధను తెలుసుకొని ఆర్థిక సాయం, వితరణలు అందిస్తూ మానవత్వం చాటుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీ టీ ఏ భద్రాద్రి కొత్తగూడెం సభ్యులు కొత్త దామోదర్ గౌడ్,బండ మనోజ్ కుమార్ రెడ్డి, కూనారపు సత్యనారాయణ ,కలసాని శ్రీనివాస రెడ్డి, పుప్పాల రామూర్తి,వాలాద్రి రాజి రెడ్డి, డా. రాజు,చిర్ర ఉప్పలయ్య గౌడ్, నరేష్ రెడ్డి, సల్లూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.