- అధైర్య పడకండి అండగా ఉంటా
- బాధిత కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు ఆగస్ట్ 2
మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధి లోని గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు,ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి బైక్ పై విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా పలు కుటుంబా లను విప్ రేగా కాంతారావు పరామర్శించారు.సమితి సింగారం గ్రామానికి చెందిన తమటం గురువారెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పటల్లో హార్ట్ సర్జరీ చేయించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటుకల కాశీం ఇటీవల కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం లో చెయ్యి ఫ్రాక్చర్ కావడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.చెరుకూరి పవన్ సంగిత్ (24) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.అనంతరం గోడిశాల రాములు దంపతులు అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల చికిత్స చేయించుకుని ఇంటి దగ్గర ఉంటున్న వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం. నరసింహారావు,స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.