మన్యం న్యూస్ మణుగూరు ఆగస్టు 2
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని పెరిక సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు రూ.50 లక్షలు మంజూరు చేశారు.ఈ నేపథ్యం లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం టెండర్ పిలిపించిన సందర్బంగా విప్ రేగా కాంతారావు కు పెరిక సంఘం సభ్యులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి సంఘం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విప్ రేగా కాంతారావు ను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో కరకగూడెం, పినపాక,మణుగూరు మండలాల అధ్యక్షులు చిట్టి. వెంకటేశ్వర్లు,కటకం గణేష్, చిట్టి.మల్లేష్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తిప్పని. శ్రీనివాసరావు,బొలిశెట్టి.కృష్ణారావు,చిట్టి సతీష్,అత్తె. నాగేశ్వరరావు,బుస్సీ శ్రీను, అటిక భిక్షం,బండారు వెంకన్న, డాక్టర్ బుడగం.రామకృష్ణ,చిట్టి. శ్రీనివాసరావు,పూజారి కృష్ణ, ఆకుల.సత్యనారాయణ పాల్గొన్నారు.