మన్యం న్యూస్ మణుగూరు: ఆగస్టు 2
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు వినతుల పర్వం కొనసాగుతోంది.మణుగూరు మండలం లోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను జిల్లాలో పని చేస్తున్న హోంగార్డులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేయడం జరిగింది.విప్ రేగా కాంతారావు మాట్లడుతూ,సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది.