UPDATES  

 దెబ్బ తిన్న పంటలపై సమగ్రమైన నివేదికలు తయారు చేయాలి – భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు వల్ల దెబ్బతిన్న నష్టాన్ని పరిశీలించేందుకు జిల్లాలో కేంద్ర కమిటి పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో కేంద్ర కమిటి పర్యటనపై రెవిన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన,
ఆర్ అండ్ బి, మిషన్ బగీరథ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమిటి పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. మండలం, క్లస్టర్ వారిగా జరిగిన నష్టాలపై వ్యవసాయ, ఉద్యాన, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, విద్యుత్, మిషన్ బగీరథ తదితర అధికారులు సమగ్ర నివేదికలతో హాజరు కావాలని చెప్పారు. జరిగిన నష్టాలు గణన సందర్భంగా అధికారులు తప్పక ప్రభుత్వ మార్గ దర్శకాలు, నిబంధనలననుసరించి ఎలాంటి పక్షపాతాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎంతో పకడ్బందిగా నివేదికలు తయారు చేయాలని చెప్పారు. దెబ్బ తిన్న పంటలపై విస్తీర్ణం, సర్వే నంబర్ వారిగా సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఐటిడిఏ పిఓ ప్రతీకై జైన్, అదనపు కలెక్టర్ రాంబాబు, డిఆర్డిఓ మధుసూదన్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, డిపిఓ రమాకాంత్, పశుసంవర్థక శాఖ డిడి పురందర్, వ్యయసాయ శాఖ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, ఆర్ అండ్ బి భీమ్లా, పిఆర్ ఈఈ మంగ్యా, గిరిజన సంక్షేమ శాఖ ఈ ఈ తానాజి, మిషన్ బగీరథ ఈ ఈ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !