UPDATES  

 సీఎం రిలీఫ్ ఫండ్ తో పేదల జీవితాలలో వెలుగులు -తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు

 

మన్యం న్యూస్ మణుగూరు: ఆగస్టు 2

సీఎం రిలీఫ్ ఫండ్ తో పేదల జీవితాలలో వెలుగులు నింపిన మహానుభావుడు సీఎం కేసిఆర్ అని విప్ రేగా కాంతారావు తెలిపారు.మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్,రేగా కాంతారావు చేతులు మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను పంపిణి చేశారు.మండలం లోని విప్పల సింగారం గ్రామానికి చెందిన పి.జ్యోతికి మంజూరైన 14 వేల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారులకు కుటుంబ సభ్యులకు విప్ రేగా కాంతరావు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ, అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదల పాలిట వరం సీఎం రిలీఫ్ ఫండ్ అన్నారు.పేద మధ్య తరగతి కుటుంబాలకు సీఎం సహాయక నిధి ఎంతగాను ఉపయోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,సీనియర్ నాయకులు రాంబాబు,కృష్ణ, నాయకుల రామకోటి,పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !