- బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు
- గులాబి కండువా కప్పి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
- అభివృధి,సంక్షేమ ఒకవైపు.. పార్టీ చేరికలు మరొకవైపు..
- జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న బిఆర్ఎస్ బాస్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు: ఆగస్టు 2
బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతరావు తెలిపారు. మణుగూరు మండలం లోని గుట్ట మల్లారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు.విప్ రేగా కాంతరావు వారిని గులాబీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు,సంక్షేమం,అభివృద్ధి లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు. రైతులకు నిరంతర 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నట్లు వారు తెలిపారు సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం లోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని విప్ రేగా తెలియజేశారు.ప్రతి కార్యకర్త కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తూ, ముందుకు వెళుతున్నది అని, సీఎం కేసీఆర్ చేపట్టే అభివృద్ధి, పథకాలు తెలంగాణ రాష్ట్రంలో పథకాలను ప్రజలు ఎంతో సద్వినియోగం చేసుకుంటున్నారు అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.గత ప్రభుత్వాలు అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించలేదని, తెలంగాణ రాష్ట్ర నేర్పడిన తర్వాత అధ్బుతమైన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల బీమా తో బరోసా కల్పించామన్నారు.రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తమ పాలన సాగిస్తున్నమని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం. నరసింహారావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ భాష,సర్పంచ్ కారం ముత్తయ్య,బిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి రామిరెడ్డి,సీనియర్ నాయకులు వట్టం రాంబాబు,యాదగిరి గౌడ్,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.