మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా మహబూబాబాద్ బదిలీ పై వెళ్తుండగా బుధవారం ఎస్ ఐ తాహెర్ బాబా కు బి ఆర్ ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా ను ఘనంగా సన్మానించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మి నారాయణ, జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ, సొసైటీ చైర్మన్ తోట రమేష్ మాట్లాడుతూ అనునిత్యం మంగపేట మండల ప్రజల న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన ఎస్ ఐ తాహెర్ బాబా, బదిలిపై వెళ్లడం చాలా బాధాకరం , వారికీ మరెన్నో ఉన్నతమైన పదవులు రావాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని తెలియజేశారు.కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజుయాదవ్, సొసైటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు నరేందర్, శ్రీధర్, లక్ష్మణ్ రావు, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు లింగయ్య, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు
