మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 02, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ప్రియాంక అలా ను జిల్లా కలెక్టరేట్ నందు వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కి పుష్పగుచ్చం అందజేసి స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైని ని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.