మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఆగస్ట్ 02: అన్నపురెడ్డిపల్లీ మండల కేంద్రానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు కృషి ద్వారా నూతన అంబులెన్స్ వచ్చినదని ఎంపీపీ సున్నం లలిత అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ కార్యాలయంలో నూతన అంబులెన్స్ ను ఆమె లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత పటిష్ఠవంతంగా చేస్తున్నదని,ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద 466 అంబులెన్స్‌ల వాహనాలను ముఖ్యమంత్రి శ్రీ కల్వవకుంట్ల చంద్రశేఖర్‌రావు జెండా ఊపి ప్రారంభించారని అన్నారు.ఇందులో 204 108అంబులెన్స్‌లు,228 అమ్మఒడి వాహనాలు,34 హర్సె వెహికిల్స్ ఉన్నాయని చెప్పారు.కాగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్నపురెడ్డిపల్లికి 108 అలాగే చండ్రుగొండకి 102 అంబులెన్స్ లు వచ్చాయని దీంతో ఇరు మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆమె చెప్పారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ షాహిన,స్థానిక సర్పంచ్ బొడ పద్మ,ఉప సర్పంచ్ పర్సా వెంకటేశ్వరరావు,అంబులెన్స్ సిబ్బంది కళాధర్,రాజా,గ్రామస్థులు వనమా గాంధీ,చల్లా పుల్లయ్య,చల్లా రమేష్,రాఘవులు, తది తరులు పాల్గొన్నారు.