- సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసరాల పంపిణీ
- రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంపిణీ
మన్యం న్యూస్ గుండాల: భారీ వర్షాలకు మండలం పరిధిలోని ముత్తాపురం గ్రామం లోని 49 ఇండ్లు పూర్తిగా గుండాల మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాకుడు తోలం శ్రీనివాస్ ను సంప్రదించి ముత్తాపురం గ్రామంలో సత్యసాయి ట్రస్ట్, సమ్మరీ టెన్స్ ఫర్ డినేషన్ సంస్థల ద్వారా గ్రామంలోని బాధితులకు బియ్యంతో పాటు మొత్తం నిత్యవసర వస్తువులను బుధవారం పంపిణీ చేశారు. అనంతరం వీరస్వామి మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించిన స్వచ్ఛంద సేవా సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవతం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవ సంస్థ నాయకులు తోలెం శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు అజ్జు, కృష్ణ , పాల్గొన్నారు
