మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలోని ప్రముఖ వ్యాపారస్తులు మానాల బ్రదర్స్ మానాల నారాయణమూర్తి, మనాల వెంకటేశ్వర్లు, మానాల వీరన్న, మానాల ప్రభాకర్, మండలంలో భారీ వర్షాలకు ముంపుకు గురైన సాయనపల్లి, నరసాపురం గ్రామాల్లో రెండు లక్షల విలువచేసే నిత్యవసర వస్తువులను ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాల సోమ సుందర్ ఆధ్వర్యంలో బుధవారం పంపిణీ చేశారు. వరదల ప్రవాహానికి పూర్తిగా దెబ్బతిన్న ఇండ్ల నిర్మాణం కోసం రేకులు, వంట సామాగ్రి తో పాటు, ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ప్రతి ఒక్కరు ముందు నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణారావు,వ్యాపారస్తులు గౌరీ శెట్టి శ్రీనివాస్, అనుమల వెంకటేశ్వర్లు, తాటిపల్లి నరసింహారావు, నాగ సుధా,మానాల ప్రణీత్ కుమార్, హనుమాన్ సెట్, తదితరులు పాల్గొన్నారు
