మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఆగస్టు 02:అన్నపురెడ్డిపల్లి మండల కేంద్ర పరిధిలోని తొట్టిపంపు గ్రామ పంచాయితీలో 2023-2025 సంవత్సరాలకు ఏజెన్సీ ప్రాంతలలోని మద్యం దుకాణాల అనుమతి కోసం బుదవారం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో పేసా గ్రామ సభ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పెసా చైర్మన్ సర్పంచ్ సున్నం చిరంజీవి అధ్యక్షతన గ్రామస్థులు మద్యం దుకాణాల అనుమతి కోసం చేతులు ఎత్తి పద్దతిలో కోరం సరిపడే షరతులతో మద్యం దుకాణాల అనుమతి ఏర్పాటుకు చేతులు ఎత్తి ఏకగ్రివంగా చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సున్నం లలిత,ఎక్సైజ్ ప్రొబిహిషన్ ఎస్ఐ దాసరి సాయికుమార్,వైస్ సర్పంచ్ కణితి అధినారాయణ,పేసా కార్యదర్శి వూకే వసంతరావు,పేసా ఉపాధ్యక్షులు సున్నం పెద్దిరాజు,పంచాయితి కార్యదర్శి,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.