UPDATES  

 తొలి మెట్టు కార్యక్రమంపై ఉపాధ్యాయులకు శిక్షణ..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఆగస్టు 02::
ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా తొలి మెట్టు కార్యక్రమంపై నరసాపురం ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని అకాడమిక్ మనిటరింగ్ ఆఫీసర్ నాగ రాజశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో కనీస అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించడానికి తొలిమెట్టు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్య, కోర్స్ డైరెక్టర్ కె విజయ కాంతారావు, రిసోర్స్ పర్సన్లు ఏజే ప్రభాకర్, శ్రీనివాస్,ప్రభాకర్,డి శ్రీనివాస్, కృష్ణార్జున ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !