మన్యం న్యూస్ దుమ్మగూడెం ఆగస్టు 02::
బ్రాహ్మణ సంఘం జిల్లా ఈసీ మెంబర్గా దుమ్ముగూడెం మండలానికి చెందిన రాఘవ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమ్మెళ్లనం బుధవారం పాల్వంచ పట్టణం వరలక్ష్మి ఫంక్షన్ హాల్ లో దుమ్ముగూడెం మండల బ్రాహ్మణా సంఘం ఉపాధ్యక్షుులు రాజ గోపాలా చార్యులు అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశం లో వివిధ మండలాల నుండి బ్రాహ్మణా పురోహితుల హాజరైనారు, వారి సమస్యల పై చర్చించుకున్నారు, సంఘ సమావేశం లో చర్ల దుమ్ముగూడెం మండల పురోహితుల సంఘం ఈ సి మెంబర్ గా దుమ్ముగూడెం మండలం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ అర్చకులు రాఘవ శర్మ అధ్యక్షులు ప్రతిపాదించగా , మిగిలిన పురోహితులు ఆమోదం తెలిపి ఏకగ్రీవం గా ఈ సి మెంబర్ గా తీర్మానం చేయడమైనది, ఈ కార్యక్రమం లో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రాజగోపాలాచారి, రాజ, విశ్వనాథ శర్మ, సత్యనారాయణ మూర్తి, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.